తాళి కట్టిన భార్యనే కాల్ గర్ల్ అంటూ సోషల్ మీడియాలో రేటు పెట్టిన ఓ భర్త అకృత్యం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. పుణ్యక్షేత్రమైన తిరుపతిలోనే ఓ శాడిస్టు భర్త వేధింపులు బయటపడ్డాయి. భార్య న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడు ఆ భర్త. 

అగ్రి సాక్షిగా పెళ్లాడిన భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా మార్చాడు. టీటీడీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట నిరోషా వివాహం జరిగింది. 

పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నాడు. అయినప్పటికీ మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు. భార్యను ఎంత వేధించినా అత్తవారి ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భార్యను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 

నిరోషా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. కాల్ గాళ్ అనీ, గంటకు రూ.3 వేలు అంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా వేధిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

 మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రేవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.