ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు దేశరాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ తదితరులు సంఘీభావం తెలిపారు. కాగా.. ఈ దీక్షలో టీడీపీ మహిళా నేత సాధినేని యామిని.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.

పార్టీ లో యాక్టివ్ గా ఉంటూ.. ప్రతిపక్ష నేతలపై తరచూ విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ గా ఉండే యామిని.. సోమవారం నాటి దీక్షలో తెలుగు తల్లి అవతారం ఎత్తారు.  ‘‘ నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’’ అనే స్లోగన్ ఉన్న ప్లకార్డుని ఆమె పట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. తెలుగు తల్లిని ప్రతిబింబించేలా ఉన్న యామిని ని పలువురు నేతలు ప్రశంసించారు.