అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా విరుచుకుపడేవారిలో ముగ్గురు పేర్లు చెప్పమంటే అందులో వినిపించే పేరు సాదినేని యామిని. 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా చేయని విమర్శలు ఉండవు. వైయస్ అంటే చాలు ఒంటికాలిపై లేస్తారు. అలాంటి సాదినేని యామిని ఇప్పుడు సరికొత్త రాగం అందుకున్నారు. 

ఓ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాదినేని యామిని వైయస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పక్కా మాస్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. జగన్ మాస్ లీడర్ అంటూ వైసీపీ పార్టీ నేతలతో కూడా చెప్తూ ఉండేదానినని చెప్పుకొచ్చారు. 

మాస్ లీడర్ గా ప్రజలతో కనెక్ట్ అయిపోయారని తాను ఉన్నానని ఒక భరోసా ఇవ్వడంలో సఫలీకృతమయ్యారని చెప్పుకొచ్చారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పకోకపోయినా జగన్ మాస్ లీడర్ గా ప్రజలకు చేరువ అయ్యారని సాదినేని యామిని చెప్పుకొచ్చారు. అయితే ఈ అభిప్రాయం తన వ్యక్తిగతంగా చెప్తున్నానని టీడీపీ అధికార ప్రతినిధిగా మాత్రం మాట్లాడటం లేదంటూ చెప్పుకొచ్చారు సాదినేని యామిని.