Asianet News TeluguAsianet News Telugu

బస్సును వెంబడించి.. ఆర్టీసీ డ్రైవర్ పై పిడిగుద్దులు, కాళ్లతో తంతూ... విచక్షణారహిత దాడి.. ఎందుకంటే..

హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై మూకుమ్మడిగా విచక్షణారహిత దాడికి  దిగారు కొంతమంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

RTC driver punched and kicked by men in Nellore - bsb
Author
First Published Oct 28, 2023, 6:49 AM IST

నెల్లూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణ ఘటన  వెలుగు చూసింది. ఆర్టీసీ డ్రైవర్ని కొంతమంది చితకబాదారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన టూవీలర్ తీయమని హారన్ కొట్టడంతో కోపానికి వచ్చిన దుండగులు.. ఆర్టీసీ డ్రైవర్ను బస్సు వెనకాల వెంబడించి మరీ అడ్డుకున్నారు. అతనిని బస్సులో నుంచి కిందికి దింపి.. పిడిగుద్దులు, తన్నులతో రెచ్చిపోయారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వారి దాడిలో డ్రైవర్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు మీద కింద పడిపోయాడు. అయినా వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతి పెట్టేస్తాం… ఎవరొస్తారో చూస్తామంటూ.. హెచ్చరిస్తూ దాడి చేశారు.

రోడ్డుమీద వెడుతున్న వారు దీన్ని ఫోన్లో రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే వారి ఫోన్లు కూడా లాక్కున్నారు. ఈ దారుణ ఘటన గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరు పాడు సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటన సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను ఇలా చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం  బెంగళూరు నుంచి విజయవాడకు వెళుతున్న ఏపీ 16 జెడ్ 0702 నెంబర్ గల బస్సు కావలి నుంచి బయలుదేరింది.

రామోజీరావుకు కొడాలి నాని బహిరంగం లేఖ.. ఇంతకీ ఏ అంశాలను ప్రస్తవించారంటే..?

ట్రంక్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా ఓ టూ వీలర్ ఉంది. ఆ బండిని జరపడానికి బిఆర్ సింగ్ అనే  బస్సు డ్రైవర్ హారర్ మోగించాడు. రోడ్డుకు అడ్డంగా బండిని పెట్టిందే కాకుండా హారన్ ఎందుకు కొట్టామంటూ టు వీలర్ ఓనర్ డ్రైవర్ తో వాదనకు దిగాడు. అయితే, అది జాతీయ రహదారి కావడంతో వెనుక ఆగిపోయిన వాహనదారులు హారన్ లో కొడుతుండడం, అక్కడే ఉన్న పోలీసులు స్పందించడంతో టూవీలర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి.. మొత్తం 14 మంది  కారులో వెంబడించి మరీ హారన్ కొట్టిన ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు.

డ్రైవర్ ను కిందికి దించి విచక్షణ రహితంగా దాడి చేయడం ప్రారంభించారు. విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ని కావాలి ప్రాంతి ఆసుపత్రికి తరలించారు. ఈ శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్, దేవరకొండ సుదీర్లతో పాటు మరో పదిమంది మీద హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరంతా కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెంగళరావు నగర్ లో ప్రత్యేకంగా స్థావరం ఏర్పాటు చేసుకొని ఇలాంటి ఘటనలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. 

దీనిమీద ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా దీనిమీద ఆందోళన వ్యక్తం చేశారు.నిందితులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios