నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఆర్టీసీ బస్సు మహిళా కండక్టర్ భర్త మీదికి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కావలి ఆర్గీసీ డిపోలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. మహిళా కండక్టర్ భర్త మీదికి బస్సు దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెడితే.. సుబ్బారాయుడు అనే వ్యక్తి భార్య కావలి బస్సు డిపోలో కండక్టర్ గా పనిచేస్తుంది.
భార్యను ఉద్యోగానికి వదలడానికి బండి మీద తీసుకువచ్చిన సుబ్బారాయుడు.. ఆమెను డిపోలో దింపి, వెడుతున్న క్రమంలో ఓ బస్సు అతని మీదికి దూసుకురావడంతో.. బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అది చూసిన మహిళా కండక్టర్ షాక్ అయ్యింది. కళ్లముందే భర్త మరణించడంతో ఆమె రోధనలు ఆపేందుకు ఎవ్వరి తరమూ కావడం లేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
