ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు.
కడప జిల్లాలో శనివారం ఓ పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రాయచోటి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సంబేపల్లి మండలం దేవపట్ల బస్ స్టాప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో బస్సు వెంటనే ఆపారు. ప్రయాణికులందరూ కిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు వారంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు మాత్రం సగానికి పైగా కాలిపోయింది. అసలు మంటలు చెలరేగానికి మాత్రం కారణం తెలియరాలేదు.
Add Asianetnews Telugu as a Preferred Source

