Asianet News TeluguAsianet News Telugu

టైరు మారుస్తుండగా లారీనీ ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి...

రోడ్డు పక్కన లారీ టైరు మారుస్తుంటే జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. 

RTC bus collided with a lorry while changing a tyre, Four killed in kakinada - bsb
Author
First Published Feb 26, 2024, 8:38 AM IST

కాకినాడ : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వద్ద ఉన్న పాదాలమ్మ గుడి దగ్గరి 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీకి పంచర్ అవ్వడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తున్నారు.  అదే సమయంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో దూసుకువచ్చి… టైరు మారుస్తున్న వారిని ఢీకొట్టింది.

అనుకొని ఈ ఘటనతో ఆ నలుగురు తప్పించుకోలేకపోయారు.. అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో దాసరి కిషన్, దాసరి ప్రసాద్, నాగయ్య, రాజులు ఉన్నారు. ఈ నలుగురిలో రాజు అనే వ్యక్తి ప్రతిపాడుకు చెందిన స్థానికుడిగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందగానే వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను మార్చరిని మొత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios