కర్నూల్ జిల్లా మంత్రాలయంలో  ఆర్ఎస్ఎస్  జాతీయ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమమయ్యాయి. సెప్టెంబర్ రెండో తేదీ వరక ఈ సమావేశాలు జరుగుతాయి. 


కర్నూల్:కర్నూల్ జిల్లా మంత్రాలయంలో ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభమమయ్యాయి. సెప్టెంబర్ రెండో తేదీ వరక ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పై చర్చించనున్నారు.

ఈ సమావేశాలకు హజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని దర్శించుకొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడ పాల్గొన్నారు.

ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఎంపిక చేసిన సుమారు 200కు పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. , ఆర్థిక, సేవా, విద్య రంగాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 

2019 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌ను సిద్దం చేసే విషయమై కూడ ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ప్రతి ఏటా రెండు దఫాలు నిర్వహించే సమావేశాల్లో భాగంగానే ఈ సమావేశాలు సాగుతున్నాయని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి అరుణ్ శుక్రవారం నాడు మంత్రాలయంలో మీడియాతో మాట్లాడారు.