నంద్యాల జిల్లా డోన్ లో జరిగిన ఓ భారీ దోపిడీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.4 కోట్లు దోచుకుని కియా కారులో పారిపోయారు దొంగలు.
నంద్యాల : నంద్యాల జిల్లా డోన్ సమీపంలో భారీ దోపిడి ఘటన వెలుగు చూసింది. రూ.4 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు దుండగులు.
గత నెల 28వ తేదీ భారీ దోపిడి జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.4 కోట్లతో కియా కారులో వెడుతుండగా.. ఆత్మకూరు సమీపంలో కారును ఆపి, కారులోని వ్యక్తులను దింపి, కారుతో సహా పరారయ్యారు. వెంటనే వీరు డోన్ పోలీసులకు మౌఖికంగా తెలిపారు. వారు రహస్యంగా విచారణ చేపట్టారు.
బాధితులు గుజరాత్, భావ్ నగర్ కి చెందిన వారిగా సమాచారం. అయితే దోపిడీ జరిగిన ఇన్ని రోజులకు ఇది వెలుగుచూసింది. అయితే దీనిమీద బాధితులు కానీ, పోలీసులు కానీ నోరు మెదపడం లేదు. డబ్బులు దోచుకుని కియాకారులో వెళ్లిన నిందితులు కియా కారును ఆత్మకూరు సమీపంలో వదిలి వెళ్లారు. దీంతో విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
