Asianet News TeluguAsianet News Telugu

ఆటో ఫినాన్స్ కంపెనీలో భారీ చోరీ.. లాకర్ తో సహా...

 అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షాప్‌ వెనుక భా గంలో ఉన్న షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి లోనికి వచ్చారు.

Rs 36 lakh  theft in finance company
Author
Hyderabad, First Published Jun 30, 2020, 2:05 PM IST

ఓ ఆటో ఫినాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. కంపెనీలోకి దూరి సీక్రెట్ రూం డోర్ ఓపెన్ చేసి ఏకంగా లాకర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శ్రీకాకుళం లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పెదపాడు రోడ్ లోని పద్మపూజిత ఆటో ఫినాన్స్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. దొంగలు.. ఏకంగా లాకర్ నే ఎత్తుకెళ్లారు. అందులో మత్తం రూ.36లక్షలు ఉన్నాయని అధికారులు చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షాప్‌ వెనుక భా గంలో ఉన్న షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి లోనికి వచ్చారు.

 అక్కడ నుంచి ఆఫీస్‌ క్యాబిన్‌ రూమ్‌లోకి వెళ్లి సీక్రెట్‌ లాకర్‌ రూమ్‌లో ఉన్న ఐరన్‌ లాకర్‌ను పట్టుకుపోయారు. దీంతోపాటు సీక్రెట్‌ కెమెరాల్లో రికార్డయ్యే హార్డ్‌ డిస్క్‌లను సై తం తస్కరించారు. షట్టర్‌ను దించేసి, ఆ పక్కనే బాత్‌రూంలో ఉన్న సర్ఫ్‌ పౌడర్‌ను నీటిలో కలిపి, తమ వేలిముద్రలు గుర్తించకుండా నురగను ఆ పరిసరాల్లో పోసి పరారయ్యారు.    

విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌ టీంతోపాటు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసు శునకం ఫైనాన్స్‌ కంపెనీ పక్క భవ నంపైకి వెళ్లి కార్యాలయం లోపలికి వచ్చి చుట్టూ తిరిగి కంపెనీ వెనుక గల ముళ్లపొద ల వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం వేలిముద్రల జాడలను సేకరించింది. ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది సిబ్బంది వేలిముద్రలను సైతం పోలీసులు తీసుకున్నారు. వీరి పాత్రతోపాటు 25 మంది కలెక్షన్‌ ఏజెంట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు. 50 కేజీల లాకర్‌ను మోసుకెళ్లారంటే.. నలుగురైదుగురు ఈ ఘటనలో పాలుపంచుకున్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు

Follow Us:
Download App:
  • android
  • ios