ఏలూరు జిల్లా చాటపర్రులో ఓ వ్యక్తి గ్రామస్తుల ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20 కోట్లు లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ నుంచి గ్రామస్తులకు నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 

ఏలూరు జిల్లా చాటపర్రులో ఘరానామోసం చోటు చేసుకుంది. గ్రామస్తుల పేరుతో కెనరా బ్యాంకులో రూ.20 కోట్ల రుణాలు తీసుకున్నాడో వ్యక్తి. గ్రామస్తుల ఆస్తి పత్రాలు తనఖా పెట్టి లోన్లు తీసుకున్నాడు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి . ఇందుకు అధికారులు కూడా అతనికి సహఖరించారు. అయితే బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నట్లుగా , బకాయిలు తీర్చాలని నోటీసులు రావడంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.