అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మెయిన్ బ్రాంచ్‌లో నిధుల గోల్‌మాల్ జరిగింది.

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మెయిన్ బ్రాంచ్‌లో నిధుల గోల్‌మాల్ జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి దాదాపు రూ. కోటి మేర నిధుల గోల్‌మాల్ చేశారు. వివరాలు.. రాయదుర్గం ఎస్‌బీఐలో మేనేజర్‌గా పనిచేసిన ఫణికుమార్.. తన బంధువుల ఖాతాల్లోకి నిధులను తరలించారు. ఫణికుమార్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులు పంపించారు. 

ఫణికుమార్ రెండు నెలల క్రితం రాయదుర్గం బ్రాంచ్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అయితే కొత్తగా వచ్చిన మేనేజర్.. దాదాపు రూ. కోటి గోల్‌మాల్ జరిగినట్టుగా గుర్తించారు. ఆడిట్ సమయంలో ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించి పోలీసులకు రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫణికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.