Asianet News TeluguAsianet News Telugu

పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా వజ్రాల పట్టివేత: రూ. 1.04 కోట్ల ఆభరణాల సీజ్

కర్నూల్ జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు భారీగా వజ్రాల నగలను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ సుమారు రూ. 1.04 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Rs.1.04 crore diamonds seized at panchalingala checkpost police lns
Author
Kurnool, First Published Apr 14, 2021, 10:57 AM IST

హైద్రాబాద్ నుండి మధురైకి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ ప్రయాణీస్తున్న ఇద్దరి నుండి ఈ నగలను స్వాధీనం చేసుకొన్నారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ చెక్ పోస్టు వద్ద పోలీసులు ఈ బస్సులో  ప్రయాణీస్తున్న ప్రయాణీకులను పోలీసులు తనిఖీ చేశారు.  ఈ తనిఖీల్లో నిందితుల నుండి  వజ్రాల నగలను స్వాధీనం చేసుకొన్నారు.

బస్సులో వజ్రాల నగలను తరలిస్తున్న రాజ్‌కుమార్, యశ్వంత్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఓ జ్యూయలరీ దుకాణానికి చెందిన  నగలుగా గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహలో  పంచలింగాల చెక్ పోస్టు వద్ద  బంగారాన్ని సీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ చెక్‌పోస్టు ఉంది.

ఈ చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలతో పాటు కచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో బంగారం, నగదును పలు దఫాలు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఇవాళ స్వాధీనం చేసుకొన్న వజ్రాల నగరాలను పోలీసులు మీడియాకు చూపారు. ఈ నగల కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు  చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios