విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని సీవీఆర్ ఫ్లైఓవర్‌పై రౌడీ షీటర్ కిలారి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్సార్ కాలనీకి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లతో వివాదం నేపథ్యంలో సురేష్‌పై కత్తులతో దాడిచేసి చంపేశారు. 

ఈ హత్యతో బెజవాడలోని స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
కిలారి సురేష్‌పై పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి, కొట్లాట కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది.. గతంలో మద్యం అతిగా సేవించిన వించిపేట, చిట్టినగర్ ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు.