అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. 

ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. 

బొలెరో వాహనంలో ఉన్నవారు క్షేమంగానే బయటపడ్డారు. వారికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.