విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి గురయిన యువకుల్లో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కొడుకు కూడా వున్నట్లు సమాచారం. 

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి జారుకుంటూ చాలాదూరం వెళ్లింది. దీంతో బైక్ పై వున్న యువకులిద్దరికీ గాయాలయ్యారు. అందులో ఓ యువకుడికి తీవ్రంగా రక్తస్రావమై గాయాల తీవ్రత ఎక్కువగా వుంది. 

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి యువకులిద్దరికి హాస్పిటల్ కు తరలించారు. వారు ప్రస్తుతం సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో తెలియాల్సి వుంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు  చేసుకుని  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.