అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. నంద్యాలలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నంద్యాల : ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద హైవేపై ఆదివారం రాత్రి ఘోర road accident జరిగింది. వేగంగా వెడుతున్న జీపు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు death చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారికి వైఎస్ఆర్ జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, సామ్రాజ్యమ్మగా గుర్తించారు. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 11న విజయనగరం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటుండగా.. రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని కబలించింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం గౌరీపురం వద్ద విశాఖ-అరకు రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడకు చెందిన కుటుంబం అరకు నుంచి కారులో తిరిగి వస్తుండగా అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కిల్లో సోనాపతి ఎస్.కోట లో ఉంటున్నారు.

ఆదివారం భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై శివలింగపురం వెళుతూ మార్గ మధ్యలో తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆగారు. అప్పుడే వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆయన పిల్లలు శ్రవణ్ (7), సుహాస్ (4) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనీ (38) ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆయన భార్య శ్రావణి తీవ్రగాయాలతో విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వాహనంపై ఉన్న ఎస్ కోట మండలం పెదఖండేపల్లికి చెందిన అప్పారావు, ఆయన తమ్ముడి కుమార్తె సుహిత (5) తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి కోమాలోకి వెళ్ళింది. వీరిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రమాదంపై ఎస్ కోట ఎస్ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోనా పతి, ఆయన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కోనాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కాగా, శ్రీరామనవమి పండుగపూట విషాదం నెలకొంది. templeలోకి బొలెరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన khammam జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటుచేసిన విభజనకు తుమ్మల పల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకు వచ్చారు. పెద్దలు భజన చేస్తుండగా పిల్లలు ఆడుకుంటున్నారు. 

రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్లున్న Bolero ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదే వేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గోడ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్ర గాయాలైన చిన్నారులను ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా దేదీప్య సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయటపడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు.