కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. 

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు..

వీరంతా తమ చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది.