కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనుమంచిపల్లి వద్ద సిరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సులోని ప్రయాణికులు గాయాలయ్యాయి. 

స్థానికులు క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెల్తోంది. 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. 

సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయకబృందం రంగంలోకి దిగింది 35 క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. 

చలి, వేకువ జాము కావడంతో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.