Asianet News TeluguAsianet News Telugu

నారా బ్రాహ్మణిపై ఆర్ఎంపీ అసభ్యకర పోస్టులు.. దేహశుద్ది చేసిన నాయకులు..

నారా బ్రాహ్మణిపై ఓ వ్యక్తి అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీంతో టీడీపీ నాయకులు అతడికి దేహశుద్ధి చేశారు. 

RMP obscene posts on Nara Brahmani in krishna district
Author
First Published Sep 30, 2022, 9:33 AM IST

కృష్ణాజిల్లా :  సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తికి టీడీపీ నాయకులు గురువారం దేహశుద్ధి చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన నరసింహ అనే వ్యక్తి ఖమ్మం టేకులపల్లిలో ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. తన ఫేస్బుక్లో ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు.. నారా బ్రాహ్మణిని అసభ్య పదజాలంతో.. వ్యక్తిగతంగా.. కించపరుస్తూ పోస్టులు పెట్టాడు.  విషయం తెలుసుకున్న టిడిపి నాయకులు కేతినేని హరీష్, నల్లమల  రంజిత్, నున్నా నవీన్, వక్కంతుల వంశీ తదితరులు కోదాటి నరసింహను ఫోన్లో ప్రశ్నించడంతో ముస్తఫా నగర్ లో ఉన్నానని చెప్పాడు.

అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా ఎందుకు పోస్టులు పెట్టారు అని అడగడంతో దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాయకులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత టీడీపీ లోక్ సభ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారా,  నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులపై వ్యక్తిగతంగా అసభ్య పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు. 

లీజు కోసం రూ.80 లక్షలు లంచం డిమాండ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ ఆరోపణలు..

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 4న  వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి..  భువనేశ్వరి నారా బ్రాహ్మణిల మీద  విరుచుకు పడింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ… జగన్ కి వస్తున్న మంచి పేరు చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని అన్నారు. అందుకే జగన్ మీద టీడీపీ ప్రచారం చేస్తుందన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలకి సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసునని  కళ్యాణి హెచ్చరించారు. వైయస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే నాలుక కోస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు.  

వైయస్ భారతి ఏరోజైనా రాజకీయాలు మాట్లాడారా?  అని ప్రశ్నించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు.. కేవలం పాల వ్యాపారం వల్లే అంటే ఎవరైనా నమ్ముతారా? అని ఆమె నిలదీశారు.  దీని వెనక భువనేశ్వరి, బ్రాహ్మణీల లిక్కర్ వ్యాపారం ఉందని కళ్యాణి ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక.. ఒక్క డిస్టిలరీకైనా అనుమతులు ఇచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక 44 వేల బెల్టు షాపులు రద్దు చేశారని, 33% మద్యం దుకాణాలను తగ్గించారని, 4500 పర్మిట్ రూంలను తొలగించారని కళ్యాణి గుర్తు చేశారు. 

పర్మిట్ రూమ్ లు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మద్యనిషేధం అమలు చేస్తే.. ఆయన చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని కళ్యాణి ఆరోపించారు. లిక్కర్ సిండికేట్ నుంచి భువనేశ్వరి వందల కోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. లిక్కర్ సిండికేట్ నుంచి భువనేశ్వరి వందలకోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆ రోజున భువనేశ్వరి ముడుపులు తీసుకున్నారు కాబట్టి టిడిపి హయాంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారని కళ్యాణి ఆరోపించారు. ముడుపుల కోసం భువనేశ్వరి, బ్రాహ్మణి గొడవ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అది నారా కుటుంబం కాదని.  సారా కుటుంబం అని అన్నారు. ఎస్పీవై రెడ్డి డిస్టిలరీల నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎన్ని ముడుపులు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios