అమరావతి: టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అనగాని సత్యప్రసాద్‌తో పాటు మరో ఏడు మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారని సమాచారం. సత్యప్రసాద్‌తో పాటు టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్‌ కూడ బీజేపీలో చేరనున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  రేపల్లే అసెంబ్లీ శాసనసభ స్థానం నుండి  మోపిదేవి వెంకటరమణపై  అనగాని సత్యప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  అనగాని సత్యప్రసాద్‌ బీజేపీలో చేరనున్నారని  ప్రచారం సాగుతోంది.

 డిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సత్యప్రసాద్ భేటీ అయ్యారని చెబుతున్నారు. సత్యప్రసాద్‌తో పాటు  ఆ పార్టీ అధికార ప్రతినిధి లంక దినకర్ కూడ బీజేపీలో చేరనున్నారని అంటున్నారు.

అనగాని సత్యప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

ఎంపీ గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురైనందునే ఆయనను  పరామర్శించేందుకు సత్యప్రసాద్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  త్వరలోనే  బీజేపీలోకి మరికొందరు టీడీపీ నేతలు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.