బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఓ మహిళపై సాముహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపిన  సంగతి  తెలిసిందే. ఈ కేసులో  నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఓ మహిళపై సాముహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నిందితులు పోలుబాయిన విజయకృష్ణ, పాలుచూరి నిఖిల్‌లను రేపల్లె అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలుడిని గుంటూరు బాల నేరస్తుల న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు.

రేపల్లె రైల్వేస్టేషన్‌ ఆవరణలో శనివారం అర్దరాత్రి గర్భంతో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో పి విజయకృష్ణ, పి నిఖిల్‌తో పాటు ఒక మైనర్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా రైల్వే స్టేషన్ సమీపంలోని నేతాజీ నగర్‌కు చెందినవారు. వారిలో ఒకరికి మూడు దొంగతనాల కేసుల్లో కూడా ప్రమేయం ఉంది. ఇక, బాధితురాలికి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

కృష్ణా జిల్లా Avanigaddaలో పని చేసేందుకు ప్రకాశం జిల్లా నుండి భార్యాభర్తలు వచ్చారని ఎస్పీ Vakul Jindal చెప్పారు. రేపల్లెలో రాత్రి పూట రైలు దిగారన్నారు. అయితే రాత్రిపూట ఆవనిగడ్డకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో రేపల్లేలోనే వారు ఉండిపోయారని SP చెప్పారు. ‘‘రాత్రిపూట స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ ఆవరణలోని బల్లపై పడుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు రైల్వే స్టేషన్ కు వచ్చి బాదితురాలి భర్తను టైమ్ అడిగారు. అతని వద్ద వాచీ లేదన్నాడు. దీంతో అతడిని కొట్టారు. అతని వద్ద ఉన్న రూ. 750 తీసుకున్నారు. భర్తను నిందితులు కొడుతుండగా బాధితురాలు అడ్డుకొనే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెపై దాడి చేశారు. ఆమెను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో ఉన్న మహిళలను బాధితురాలి భర్త సహాయం కోరాడు. అయితే వారు తాము ఏమీ చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేశారు’’ అని ఎస్పీ వివరించారు. 

రైల్వే స్టేషన్‌కు సమీపంలోని 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉందని చెప్పడంతో బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం ఇచ్చాడని చెప్పారు. వెంటనే పోలీసులు రైల్వే స్టేషన్ కు రావడంతో పోలీసులు పారిపోయారని ఎస్పీ జిందాల్ తెలిపారు. రేపల్లె నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ లోని ఆధారాలను బట్టి నిందితులను గుర్తించామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రత్యేక స్క్వాడ్‌ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. ఇక, నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 డి, 394, 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.