భూములు వెనక్కి ఇచ్చేసిన రిలయన్స్.. రూ. 15000 కోట్ల ఏపీ ప్రాజెక్టుకు మంగళం..

తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం  కేటాయించిన భూములను రాష్ట్ర మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి ఇచ్చేసింది. 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సెటప్ బాక్స్ లు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్  తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సంస్థ విరమించుకుంది.

Reliance says goodbye to AP,  Break for Rs 15,000 crore project, those lands back - bsb

తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం  కేటాయించిన భూములను రాష్ట్ర మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి ఇచ్చేసింది. 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సెటప్ బాక్స్ లు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్  తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సంస్థ విరమించుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.  భూముల కోసం సంస్థ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. 

రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం 136 ఎకరాలను కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది.  రిలయన్స్ కు కేటాయించిన భూముల కు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఇలా సుమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. దీంతో కేసులు పరిష్కారం అయ్యేవరకు యూనిట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. 

ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం వాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములు కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సాను కులత వ్యక్తం కాలేదని ఓ అధికారి తెలిపారు. ఆ భూములనే తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. 

‘సెటప్ బాక్స్ అసెంబ్లీ యూనిట్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్ సంస్థ విరమించింది.  సంస్థ అవసరాల మేరకు సెటప్ బాక్స్ ల తయారీకి ఫాక్స్ కాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అధికారులు జరిపిన సంప్రదింపుల్లో వెల్లడించింది’ అని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios