శేషాచలం అడవుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. తిరుపతి కరకంబాడీ రోడ్డు హరితకాలనీ వద్ద స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించాయి

శేషాచలం అడవుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి దిగారు. తిరుపతి కరకంబాడీ రోడ్డు హరితకాలనీ వద్ద స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లర్లకి.. టాస్క్‌ఫోర్స్ ఎదురుపడ్డారు. లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికి వారు సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో టాస్క్‌ఫోర్స్ గాల్లోకి కాల్పులు జరిపింది. దీంతో వారు అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు.. తప్పించుకున్న స్మగ్లర్ల కోసం పోలీసులు, టాస్క్‌ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టాయి.