విశాఖపట్టణం: బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి  రామకోటయ్య రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

బ్రహ్మణుల సంక్షేమం కోసం  పనిచేస్తున్న టీడీపీతో  కలిసి పనిచేస్తానని రామకోటయ్య ప్రకటించారు. తన రాజీనామా లేఖను రామకోటయ్య  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సోమవారం నాడు పంపారు. రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రామకోటయ్య విమర్శలు గుప్పించారు.