సూర్యుడి భగభగలతో వణికిపోతున్న ఏపీ వాసులకు వాతావరణ వాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో స్థిరంగా ఉంది.

ఓ నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి.. అది క్రమేణా స్థిరపడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే సమయంలో బీహార్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి వుంది. దీని కారణంగా రాయలసీమ, కోస్తాల్లో కొన్ని చోట్ల వానలు కురిశాయి.

Also Read:నరసరావుపేటలో కరోనా విజృంభణ: మిషన్ మే 15 పేరుతో అధికారుల యాక్షన్

రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

మే నెల కావడంతో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలు, తిరుపతి, అనంతపురంలలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.

Also Read:విజయనగరం జిల్లాకు సైతం పాకిన కరోనా: తొలి పాజిటివ్ కేసు నమోదు

ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 45 డిగ్రీల నమోదవుతుండగా.. రాత్రి వేళ 30 డిగ్రీల వేడి ఉంటోందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణలో బుధవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి మే 8 నాటికి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి ఎంఫాన్ అని పేరు కూడా పెట్టారు. అయితే  ఏపీలో తేమ లేకపోవడంతో అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ లేకుండా పోయింది.