రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలు బయటపడ్డాయి. ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి సెకన్ల వ్యవధిలో తత్కాల్ టికెట్లను కొందరు మాయం చేసినట్లు రైల్వే శాఖ అంతర్గత విచారణలో బయటపడింది.

ప్రధానంగా గుంటూరు, నరసరావుపేట కేంద్రాలుగా తత్కాల్ స్కాంలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నెట్ సెంటర్ నిర్వాహకులకు రైల్వే శాఖ నోటిసులు జారీ చేసింది.

వీరితో పాటు మరికొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా వేసవి సెలవులు ముగిసిన తర్వాత రద్దీని క్యాష్ చేసుకునేందుకు కొందరు ముఠా ఏర్పడినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.