Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రత్యేక హోదా ఇచ్చితీరుతాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని రాహుల్ స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్నది తమకు సమస్య కాదన్నారు. 

rahul gandhi comments on pm modi
Author
Tirupati, First Published Feb 22, 2019, 6:09 PM IST

తిరుపతి: భారత ప్రధాని నరేంద్రమోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిఆ తర్వాత మాట తప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ హోదా భరోసాయాత్ర బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని రాహుల్ స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్నది తమకు సమస్య కాదన్నారు. 

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తమకు సంబంధం లేదని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభించిందని ఆరోపించారు. 

ప్రత్యేక హోదా ఇస్తామని ఆ నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఆ హామీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీగా పరిగణించకూడదని భారత ప్రధాని ఇచ్చినట్లుగా గౌరవించాలని సూచించారు. ప్రధాని హామీ ఇచ్చారంటే భారతదేశం హామీ ఇచ్చినట్లేనని తెలిపారు. ప్రధానిని ఒక వ్యక్తిగా కాకుండా దేశ ప్రతినిధిగా చూడాలని రాహుల్ గాంధీ సూచించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios