Asianet News TeluguAsianet News Telugu

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ రిటర్న్: రఘురామ స్పందన ఇదీ...

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైందనే వార్తల్లో నిజం లేదని రఘురామకృష్ణమ రాజు స్పష్టం చేశారు. 

Raghurama Krishnama raju clarifies on the petitin filed against YS Jagan
Author
amaravati, First Published Apr 7, 2021, 8:06 PM IST

అమరావతి:ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు వేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్ ప్రోసీడింగ్స్ సరిగా లేవని సిబిఐ కోర్టు తెలిపింది. సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ మీద సిబిఐ 11 చార్జిషిట్లు నమోదు చేసిందని రఘురామకృష్ణమ రాజు చెప్పారు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తాను వేసిన వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు స్పష్టం చేశారు. బెయిల్ సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోర్టు కోరిందని, తిరస్కరించలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 

అవసరమైన పత్రాలను శుక్రవారం దాఖలు చేస్తామని, తనను అడ్డుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారని, వచ్చే వారం ఈ కేసుపై వాదనలు కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నానని ఆయన అన్నారు. 

అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా జగన్, సహ నిందితుడైన ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణమరాజు హైదరాబాదు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

జగన్, విజయసాయి రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని, చిన్నపాటి సాకులతో కోర్టుకు రాకుండా తప్పించకుంటున్నారని ఆయన అన్నారు. బెయిల్ ద్వారా సంక్రమించిన స్వేచ్ఛను జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. బెయిల్ ఎందుకు రద్దు చేయాలో వివరిస్తూ 26 అంశాలను, ఉప అంశాలను పిటిషన్ లో రఘురామకృష్ణమ రాజు ప్రస్తావించారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios