న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మద్దతుగా నిలిచారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదంలో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సలహా ఇచ్చారు. న్యాయవ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్ స్టాప్ పెడదామని ఆయన అన్నారు. 

ఇప్పటికైనా జగన్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా తిరిగి నియమించాలని ఆయన కోరారు. కోర్టుకు తీర్పు మేరకు రమేష్ కుమార్ ను నియమిస్తే వచ్చే నష్టం ఏమిటని ఆయన అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైందని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. 

రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రభుత్వానికి ఏ విదమైన అధికారం కూడా లేదని రఘురామకృష్ణమ రాజు అన్నారు. ప్రభుత్వానికి సూచన చేయడమే తన తప్పా అని ఆయన ప్రశ్నించారు 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం, రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయానలి ఢిల్లీ వచ్చి వేడుకున్నారని ఆయన అన్నారు. 

ప్రజాస్వామ్యబద్దంగా అత్యంత అధిక మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం మనది అని, పక్కన ఉన్నవారి మాటలు విని సీఎం జనగ్ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన అన్నారు. రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కూడా లేని కొద్ది మంది తనపై ఫిర్యాదు చేస్తే ఏమవుతుందని ఆయన అన్నారు. 

ప్రజాస్వామబ్దదంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇది రాచరికం కాదని, ప్రజాస్వామ్య  దేశమని, న్యాయస్థానాలను గౌరవిద్దామని, న్యాయవ్యవస్థ విలువను కాపాడుదామని ఆయన అన్నారు.