మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రికి రాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం సిద్ధమువుతున్నారంటూ నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రికి రాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం సిద్ధమువుతున్నారంటూ నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు తమ ప్రభుత్వం చెప్పనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట.. మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట.. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారట.
ఈ అప్రతిహత విజయాన్ని సాకుగా చూపెట్టి.. ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాత్రికి రాత్రే లేచిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. లీగల్ గా ఇది చెల్లదు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్రటేరియట్ అనేది ఇక్కడే ఉంటుంది. అత్యంత దారుణంగా డబ్బులు వృథా అవుతున్నాయి. ఆఖరుకి నా నియోజకవర్గానికి వెళ్లాలంటే.. రూరల్ గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ వర్మ ఆదేశాలతో ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
