Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. రాష్ట్రపతికి రఘురామ లేఖ

ఈ ఆర్థిక సంవత్సరంలో 142శాతం బడ్జెట్ అంచనాలను మించి సర్కార్ అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలుతుందోననే భయం వేస్తోందన్నారు.

raghurama krishnam raju press meet on ap financial situation
Author
Hyderabad, First Published Aug 9, 2021, 2:22 PM IST

న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని దీనిపై  రాష్ట్రపతి రామనాథ్ కొవింద్‌కు లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారన్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో 142శాతం బడ్జెట్ అంచనాలను మించి సర్కార్ అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలుతుందోననే భయం వేస్తోందన్నారు.

బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

రాష్ట్రం చేస్తున్న అప్పుల్లో 42 శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లిచడానికే సరిపోతుందన్నారు. జులై రెండో వారం వరకు కూడా  ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేదన్నారు. 

తక్షణం ఏపీలో కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని ఆ లేఖలో రాష్ట్రపతిని పేర్కొన్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios