Asianet News TeluguAsianet News Telugu

రఘురామ కేసు : ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోం... సుప్రీం కోర్టు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టారనే ఆరోపణలమీద సీబీఐ దర్యాప్తుకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మీద మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్ ను రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. 

raghurama krishnam raju petition inquiry postponed six weeks in supreme court - bsb
Author
Hyderabad, First Published May 25, 2021, 3:36 PM IST

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టారనే ఆరోపణలమీద సీబీఐ దర్యాప్తుకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మీద మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్ ను రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. 

ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయం మీద న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరువారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వాన్ని, ప్రబుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, తన తండ్రిని సీఐడీ పోలీసులు కొట్టారని ఈ విషయమై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసే విధంగా వ్యవహరించారనే నెపంతో ఏపీ సీఐడీ అధికారులు  

ఈ నెల 14వ తేదీన  అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ నుండి  ఆయనను విజయవాడకు తరలించారు. విజయవాడలో అదే రోజు రాత్రి సీఐడీ అధికారులు తనను కొట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విజయవాడ కోర్టుకు కూడ వివరించారు. ఇదే విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోపుగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios