Asianet News TeluguAsianet News Telugu

జగన్ బెయిల్ రద్దు కోరాననే....: ఓం బిర్లాకు రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తన ఆరెస్టుపై, తదనంతర పరిస్థితులపై ఆయన ఓ వినపతిపత్రం సమర్పించారు. జగన్ బెయిల్ రద్దు కోరారనే తనను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.

Raghurama Krishnam Raju meets Lok Sabha speaker OM Birla
Author
new delhi, First Published Jun 3, 2021, 7:54 AM IST

న్యూఢిల్లీ: వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరాననే కోపంతోనే తనపై కేసు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఓం బిర్లాకు ఓ వినపతిపత్రం సమర్పించారు. 

రఘురామ కృష్ణంరాజు బుధవారం రాత్రి ఓం బిర్లాను కలిశారు. తనపై పెట్టిన రాజద్రోహం కేసు గురించి, ఆ తర్వాతని పరిణామాలపై ఆయన ఓం బిర్లాకు వినతిపత్రం సమర్పించారు. తన కేసులో సిఎం జనగ్, డిజిపీ, గౌతం సవాంగ్, సిఐడి ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్ లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

తనపై ఐపిసీ 124 కింద రాజద్రోహం కేసు పెట్టి కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టి గాయపరిచారని ఆయన చెప్పారు. సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనను ఐదుగురు ముసుగు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని కూడా ఆయన ఆరోపించారు. 

పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని ఆయన చెప్పారు మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నన్ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన స్పీకర్ కు చెప్పారు. గుంట్ూరు ప్రబుత్వ వైద్యుల బృందం తన గాయాలపై తప్పుడు నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. సిఐడి పోలీసులు సిఐడి కోర్టు, హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. వారికి కోర్టు ధిక్కారం నోటీసులు కూడా జారీ అయినట్లు ఆయన తెలిపారు. 

తాను సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రీలో వైద్య పరీక్షలు జరిగాయని, తనకు గాయాలున్నట్లు ఆస్పత్రి ధ్రువీకరించిందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్లు రఘురామ స్పీకర్ ఓం బిర్లాకు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios