Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య కేసు : సీబీఐ ముందుగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించాలి.. రఘురామ కృష్ణరాజు...

జగన్ కు, నాకు మధ్య 19 శాతమే వ్యత్యాసం, తప్పుడు ప్రచారం ఆపేందుకు సర్వే వివరాలు చెప్పా.. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60 శాతం ప్రజల మద్దతు ఉంది. అమరరాజాలో కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. మరి నాసిరకం మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరు?’ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.

raghu rama krishnam raju press meet, fires on vijaysai reddy
Author
Hyderabad, First Published Aug 24, 2021, 8:50 AM IST

ఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు విజయసాయిరెడ్డికి ఎవరు చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘నరసాపురంలో జగన్, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని సర్వే చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో తేలింది. 

జగన్ కు, నాకు మధ్య 19 శాతమే వ్యత్యాసం, తప్పుడు ప్రచారం ఆపేందుకు సర్వే వివరాలు చెప్పా.. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60 శాతం ప్రజల మద్దతు ఉంది. అమరరాజాలో కాలుష్యం గురించి మాట్లాడుతున్నారు. మరి నాసిరకం మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరు?’ అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. 

కాగా, ‘ముందు పృథ్వి, తర్వాత ఎమ్మెల్యే అంబటి రాంబాబు,  తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్  మహిళలకు ఫోన్లో చేశారంటూ వాయిస్ లో బయటకు వచ్చాయి.  తాము చేయలేదు, తమ గొంతులను అనుకరించాడు అంటూ వారు మీడియాకు చెప్పారు.  ఆ గొంతులను అనుకరించిన కళాకారులు ఎవరో తేల్చేందుకు విచారణ చేపట్టాలి’  అని డిమాండ్ చేశారు. 

ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ విషయాన్ని త్వరగా తేల్చకపోతే తనది, తమ ముఖ్యమంత్రి స్వరం కూడా అనుకరిస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆడియోల వెనుక కుట్రదారులెవరో తేల్చాలని ఆయన కోరారు. కేసు మీద ముఖ్యమంత్రి, డీజీపీ దృష్టి సారించాలని కోరారు. 

గుంటూరులో రమ్య హత్యోదంతం మరువక ముందే అదే జిల్లా రాజుపాలెంలో ఓ దళిత యువతిపై అత్యాచారం చేశారని, విజయనగరంలో యువతి మీద పెట్రోల్ పోస నిప్పంటించారని ఆయన తెలిపారు. 

20వ తేదీ వచ్చినా 20 శాతం ఉద్యోగులకు జీతాలు అందలేదని పలువురు చెప్పారని ఆయన తెలిపారు. జగనన్న ప్రభుత్వం రూ.2.56 లక్షల కోట్ల అప్పులు చేసిందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. సీపీఎస్ ఉద్యోగుల వేతనాల నుంచి మినమాయించిన, తమ వాటా నుంచి ప్రాన్ ఖాతాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడం లేదనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధి మించి అప్పులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో జీతాలు, పింఛన్లు, అప్పులకు వడ్డలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

విశాఖలో సర్క్యూట్ హౌస్ వెనుక ఉణ్న దసపల్లా భూములపై 22 (ఎ) సెక్షన్ ను ఎత్తివేసిన 24 గంటల్లోనే అవి రిజిస్ట్రేషన్ అయ్యాయని ఎంపీ తెలిపారు. పోలవరం కడుతున్న ఓ వ్యక్తికే ఆ భూములు కట్టబెట్టారని ఆరోపించారు. కలెక్టర్ మారి, కడప జిల్లాకు చెందిన వ్యక్తి కలెక్టర్ గా రాగానే ఇది చోటు చేసుకుందని, విశాఖ కలెక్టర్, జేసీ, మరో ఉన్నతాధికారి కడప జిల్లా వాసులు కావడం యాదృచ్ఛికమేమో తనకు తెలియదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios