సారాంశం

‘ఎల్లో జర్నలిజం-పోరాటం’ అని గ్రూపు వన్ మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్న ఇవ్వడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీపీఎస్సీ తీరుపై మండిపడుతున్నారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో యెల్లో జర్నలిజంపై ప్రశ్న ఇచ్చారు. దీనిపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రభావానికి గురవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో ‘ఎల్లో జర్నలిజంపై పోరాటం’ అనే ప్రశ్నను ఇచ్చారు. 

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వాస్తవాలు రావడానికి జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఈ నేపథ్యంలోనే కొన్ని పత్రికలను ఉద్దేశిస్తూ ఎల్లో జర్నలిజం అంటూ పదేపదే మాట్లాడడం కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతలు,  మంత్రులు కూడా ముఖ్యమంత్రి మాటకి వంతపడుతున్నారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో మరుగుదొడ్లో పేలిన బాంబులు.. 11యేళ్ల బాలుడి మృతి..

ఇలాంటి పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ పరీక్షల్లో యెల్లో జర్నలిజం మీద పోరాటం అనే ప్రశ్న ఇవ్వడం.. చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నతో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో ప్రజాస్వామ్యం- సోషల్ మీడియా పాత్ర గురించి కూడా ఓ ప్రశ్న వచ్చింది. 20 మార్కుల ప్రశ్న  విభాగంలో ఈ రెండు ప్రశ్నలు వచ్చాయి. ఐదు ప్రశ్నలు ఇచ్చి దాంట్లో ఒకదానికి జవాబు రాయాలని కోరారు. ఈ కేటగిరీలోనే ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి.

గతవారం జరిగిన తెలుగు పరీక్షల్లో సమాజం మీద సోషల్ మీడియా ప్రభావం అన్న అంశంపై కూడా ప్రశ్నించారు. ఇంగ్లీష్ పరీక్షలోనూ మళ్లీ ఆ ప్రశ్న రిపీట్ అయింది. తెలుగు పరీక్షలో ‘నాడు- నేడు’ కింద చేపట్టిన నిర్మాణాల గురించి ప్రశ్న వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సోమవారం గ్రూప్ వన్ మెయిన్స్ జరిగాయి.  ఈ  ఎగ్జామ్స్ కు  4944 మంది హాజరయ్యారు.