Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి  నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.

pulivendula court permits to narco test for gangi reddy
Author
Amaravathi, First Published Jul 12, 2019, 12:12 PM IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి  నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో  ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్  విచారిస్తున్నారు. ఈ కేసులో  సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో  నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.

శుక్రవారం రాత్రి పులివెందుల పోలీసులు  గంగిరెడ్డిని  హైద్రాబాద్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే  ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ పరీక్షలకు కోర్టు అనుమతిని ఇచ్చింది.

వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్  రంగయ్య, ఈ కేసులో అనుమానితుడు శేఖర్ రెడ్డిలకు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి  కూడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో  నార్కో టెస్ట్‌కు అనుమతి ఇచ్చిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios