Asianet News TeluguAsianet News Telugu

రుయా ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం..

అమరావతి : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Public interest litigation in high court over tirupati ruia hospital incident - bsb
Author
Hyderabad, First Published May 17, 2021, 1:40 PM IST

అమరావతి : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కోవిడ్ బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని,  కోవిడ్ బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు ఆలస్యం లేకుండా  రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలని, రుయా ఆసుపత్రి ఘటనపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని పిల్‌లో తెలిపారు. రుయా ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈ నెల 10న తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, 11 మంది రోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.  20 నిమిషాల పాటు  ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టుగా రోగుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది రోగులు మృతి చెందారు. మరో 30 మంది  పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

రుయాలో 11 మంది రోగుల మృతి: ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా...

రుయా ఆసుపత్రిలో సోమవారం నాడు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆక్సిజన్ జరగలేదు.  దీంతో ఆసుపత్రిలో అప్పటికే 135 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.  

ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో  రోగుల బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు నుండి ఆక్సిజన్ ట్యాంకర్ 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. ఆక్సిజన్ అందని కారణంగా 11 మంది మరణించారని కలెక్టర్ తెలిపారు. 

ఆక్సిజన్ అందని కారణంగా  మరో 30 మంది  రోగుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో రోగుల బంధువులు ఆసుపత్రిలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.   

ఇదిలా ఉంటే సోమవారం నాడు రాత్రి  రుయా ఆసుపత్రి వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొన్నారు. ఈ ఘటనపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొన్న పరిణామాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios