ఈ సమయంలో ఓ మహిళా కార్యకర్త మంత్రి ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులను అరెస్టు చేశారు.

కడపలో కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప వాసులు కోరుతున్న సంగతి తెలిసిందే. దానిని కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కాగా.. ఈ ఉక్కు సెగ ఇప్పుడు కేంద్ర మంత్రికి ఎదురైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కడప ఆర్‌అండ్‌బీ వద్ద అనంతకుమార్‌ను రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఓ మహిళా కార్యకర్త అనంతకుమార్‌ ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులను అరెస్టు చేశారు.