సారాంశం
కృష్ణా జిల్లాలో మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది.
పెనమలూరు : మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. కృష్ణా జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపుదాడిచేసారు. ఈ క్రమంలో నిర్వహకులతో పాటు అమ్మాయిలను, విటులను అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజవకర్గ పరిధిలో మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయిలతో క్రాస్ మసాజ్ పేరిట ఏకంగా ఓ యాప్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు నిర్వహకులు. ఇలా వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన యువతులను బడా బాబులకు సరఫరా కూడా చేస్తోంది వ్యబిచార ముఠా. ఇలా హైటెక్ పద్దతిలో సాగుతున్న వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
వీడియో
మసాజ్ సెంటర్లపై దాడిలో సంచలన విషయాలు బయటపడ్డారు. ఓ మసాజ్ సెంటర్ కొనసాగుతున్న భవనం ఓ పోలీసుదిగా బయటపడింది. దీంతో సదరు పోలీస్ కు ఈ వ్యభిచార దందాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ హైటెక్ వ్యభిచార దందాలో సదరు పోలీస్ పాత్రపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
Read More సెక్స్ రాకెట్‌లో ఇద్దరు హీరోయిన్‌ల పట్టివేత.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏజెంట్ల అరెస్టు
అయితే ఈ వ్యభిచార ముఠాలో పోలీస్ పాత్ర భయటపడటంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మసాజ్ సెంటర్లపై దాడి చేసి అమ్మాయిలను, విటులను అదుపులోకి తీసుకున్నా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని సమాచారం.