విజయనగరంలో బస్సు బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ జంక్షన్ సర్కిల్ వద్ద ఓ కారు టర్న్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది.

ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జయి బస్సు కిందకు వెళ్లిపోయిందంటే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కారును బస్సు వేగంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగంలో కూర్చొన్న ప్రయాణికులు కూడా ఎగిరి బయటకు పడ్డారు.

ప్రమాదంలో కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. బస్సులోంచి రోడ్డు మీదకు వచ్చి పడ్డ ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారులో ఇరుక్కున్న వారిని అతికష్టమ్మీద బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు.