కాకినాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి విద్యార్థిని మీద స్కూల్ కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు టాబ్లెట్లు ఇచ్చి నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.
కాకినాడ : ఓ బాలికపై Sexual assault చేసిన ఘటనలో హెల్పింగ్ హాండ్స్ School Correspondent 60 ఏళ్ల విజయ్ కుమార్ను అరెస్టు చేసి, POCSO Act కింద కేసు నమోదు చేసినట్లు దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి సుంకర మురళీమోహన్ వివరించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ కొండయ్య పాలెంలోని హెల్పింగ్ హ్యాండ్ స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ అదే స్కూల్ వసతి గృహంలో ఉండే 9వ తరగతి విద్యార్థిని(14)కి మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి నాలుగు నెలలుగా పలుమార్లు లైంగికదాడి చేశాడు.
దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఇక వేసవి సెలవులు కావడంతో గొడారిగుంటలోని తన ఇంటికి ఆమె వెళ్ళింది. రెండు రోజులుగా బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె తల్లికి విషయం చెప్పింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్కుమార్ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. ఇదే స్కూల్ లో 40 మంది విద్యార్థులు ఉన్నారని, స్కూల్కి సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతుందని వివరించారు.
ఇదిలా ఉండగా, UttarPradeshలోని చిత్రకూట్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి బయట నిద్రిస్తున్న బాలికను
Kidnap చేసి gang rapeకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెడితే... ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో బుధవారం 13 ఏళ్ల దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురై, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న బాలిక బుధవారం రాత్రి తన కుటుంబంతో కలిసి తన ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో సామూహిక అత్యాచారానికి గురైందని పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మ పిటిఐకి తెలిపారు.
అత్యాచార బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు ఆమె పోస్ట్ మార్టం నివేదిక ధృవీకరించింది. శవపరీక్ష రిపోర్ట్ శనివారం ఆలస్యంగా అందిందని, బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని పోలీసులు ఆదివారంతెలిపారు. ఆరుబయట నిద్రిస్తున్న బాలిక బుధవారం రాత్రి కనిపించకుండా పోయి.. గురువారం రెండు చేతులు కట్టివేయబడిన స్థితిలో దొరికింది. ఈ ఘటనలో నదీమ్, ఆదర్శ్ పాండే, విపుల్ మిశ్రా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు శర్మ తెలిపారు.
మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం
పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో చిత్రకూట్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం, బాధితురాలు తన ఇంటి బయట నిద్రిస్తుండగా, ఒక యువకుడు, కూలీ వారి ఇంట్లోకి ప్రవేశించి బాలికను అపహరించారు. ఆ తరువాత నిందితులు బాధితురాలిని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు ఇంటి బయట కనిపించకపోవడంతో ఆమె కోసం వెతకడం ప్రారంభించామని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పొలంలో పడి ఉన్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కౌశాంబిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన బాలిక గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నివేదికలోని వివరాలను పహాడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అజిత్ పాండే ధృవీకరించారు.
