మూడో తరగతి బాలికతో హెచ్ఎం అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి..
మూడో తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడో ప్రధానోపాధ్యాయుడు ఆ చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో అతనికి దేహశుద్ధి చేశారు.

గుంటూరు : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి నీచానికి దిగజారాడు. మంచి చెడు చెప్పాల్సిన స్కూలు ప్రిన్సిపాల్ గాడి తప్పి వ్యవహరించాడు. తన స్కూల్లో చదివే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు కీచక ప్రధానోపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. దీని మీద పోలీసు కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది.
ఆ స్కూల్లో షేక్ అబ్దుల్ షాజహాన్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అతను అతను గుంటూరు ఆనంద పేట కు చెందినవాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఆమె పట్ల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో బాలిక భయపడిపోయింది. స్కూల్ కి వెళ్లడానికి భయపడుతుంది. వారం రోజులుగా ఏదో ఒక సాకుతో స్కూలుకు వెళ్లడం లేదు. అమ్మాయి డల్ గా ఉండడం.. భయపడుతూ ఉండడంతో ఆమె తల్లి.. జ్వరంవల్లేమో అనుకుంది. జ్వరం మందులు వేసింది.
కాకినాడ జేఎన్‌టీయూలో ఎంబీఏ విద్యార్ధినికి వేధింపులు: కాంట్రాక్టు లెక్చరర్‌పై వేటు
అయినా కూడా చిన్నారి ఈ విషయంలో మార్పు లేకపోవడంతో… అసలు విషయం ఏంటి అని అనునయించి అడిగింది. దీంతో బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు స్కూల్ దగ్గరికి వెళ్లి ప్రధానోపాధ్యాయుని విషయం ఏంటని ఏమిటని నిలదీశారు. తనకేం తెలియదని బుకాయించబోయాడు. దీంతో ఆగ్రహానికి వచ్చిన అందరూ.. కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని పట్టాభిపురం పోలీసులకు తెలిపారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని మొదట ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స చేయించి.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, నవంబర్ 29న పాట్నాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పాట్నా, కైమూర్ జిల్లాలో 14 ఏళ్ల బాలికను నలుగురు అబ్బాయిలు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రాణాలతో బయటపడిన ఆమె.. ఓ వ్యక్తి సహాయం కోరింది. అయితే, సహాయం చేయాల్సింది పోయి.. ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకున్నాడి కీచకుడు. తాను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.
గ్యాంగ్ రేప్ బాధితురాలి మీద అత్యాచారానికి పాల్పడిన ఆ వ్యక్తిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పోలీసులు గుర్తించారు. దీనిమీద బాలిక తల్లిదండ్రులు గత శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు (55), ఒక మైనర్ అబ్బాయితో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భభువా ఎస్డీపీఓ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిని శనివారం అరెస్టు చేసి జైలుకు పంపగా, సోమవారం బాలనేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‌హోమ్‌కు పంపారు. అత్యాచార బాధితురాలికి, నిందితులకు వైద్య పరీక్షలు చేశామని సింగ్ చెప్పారు. ఇతర నిందితుల కోసం వెతుకులాట కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.