Asianet News TeluguAsianet News Telugu

ప్రీపోల్ సర్వే: బాబుపై జగన్ దే పైచేయి, పవన్ నామమాత్రమే

ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందని సర్వేలో పేర్కొంది.సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

prepolling survey.. jagan will become cm?
Author
Hyderabad, First Published Sep 15, 2018, 9:40 AM IST

ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో తెలియజేస్తూ ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడం ఖాయమని తెలుస్తోంది. కచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందని సర్వేలో పేర్కొంది.సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే  జగన్‌మోహన్‌రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు.

ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు  దాదాపు 10,650  మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది.  వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్‌  వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది.

ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios