నిండు గర్భిణీనిని ఓ కర్రకు చీరకట్టి.. దాంట్లో ఆమెను కూర్చోపెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో నే ఆమె ప్రసవించింది. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలోని ఓ మూరుమూల గ్రామానికి చెందిన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. హాస్పటల్ కి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం   కూడా లేకపోవడంతో.. ఆమె కుటుంబసభ్యులు ఓ కర్రకు చీరకట్టి.. అందులో ఆమెను కూర్చొపెట్టి మోసుకుంటూ వెళ్లారు. వారు ఉంటున్న గ్రామం నుంచి హాస్పటిల్ కి 7కిలోమీటర్ల దూరం కాగా.. మరో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆస్పత్రికి వెళతారనగా.. ఆమె ప్రసవించింది.

 

కాగా.. మహిళను వారి కుటుంబసభ్యులు అలా మోసుకువెళ్లడాన్ని కొందరు వీడియో తీయగా.. అది వైరల్ గా మారింది. వారి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి బిడ్డ క్షేమంగానే బయటపడ్డారు. అయితే.. రోడ్డు వేయమని అధికారులను ఎన్నిసార్లు కోరుకున్నప్పటికీ.. వారు కనికరించలేదని గ్రామస్థులు వాపోయారు.