సస్పెన్షన్ పై నిబంధనలు పాటించలేదు , న్యాయపోరాటం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

2014లో జగన్ పై ఉన్న సానుభూతితోనే తాను వైసీపీలో చేరినట్టుగా  మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. గత ఎన్నికల్లో  జగన్ కు ఇచ్చిన హామీ మేరకు ప్రసాదరాజు విజయం కోసం పనిచేసినట్టుగా చెప్పారు. 

Prasad Raju Followers not Supported Me In 2014 Election  Former Mnister Kothapalli Subbarayudu

నర్సాపురం: జైలుకు వెళ్లాడని YS Jagan పై ఉన్న సానుభూతితోనే తాను 2014లో YCP లో చేరానని మాజీ మంత్రి Kothapalli Subbarayudu చెప్పారు. ఆ సమయంలో తనను TDP లో చేరాలని Chandrababu సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారన్నారు. 

గురువారం నాడు నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు.  కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుండి వైఎస్ జగన్ ఈ నెల 1వ తేదీన సస్పెండ్ చేశారు. కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే Prasada Rajuకు, కొత్తపల్లి సుబ్బారాయుడికి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ తరుణంలో కొత్తపల్లి సుబ్బారాయుడు తనకు ప్రత్యేక వర్గం ఉందని చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఆయనపై Suspension వేటు పడింది. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

గతంలో Congress పార్టీ అభ్యర్ధిగా తాను విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొంటూ ఈ విజయం ఇండిపెండెంట్ గా విజయం సాధించినట్టే లెక్క అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని కూడా తాను ధీమాగా ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  ఆ సమయంలో తనకు ఓ ఫంక్షన్ లో చంద్రబాబునాయుడు కలిశాడన్నారు. నర్సాపురం అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని చంద్రబాబు తన వద్ద ప్రస్తావించారన్నారు. అయితేఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని చెప్పినట్టుగా సుబ్బారాయుడు గుర్తు చేసుకున్నారు. 

నీవు ఎక్కడ విజయం సాధిస్తావని చంద్రబాబు కూడా తనతో అన్నారన్నారు. కానీ ఆ ఎన్నికల్లో తాను విజయం సాధించినట్టుగా సుబ్బారాయుడు చెప్పారు. కాంగ్రెస్ నేతలకు కూడా తాను విజయం సాధిస్తాననే నమ్మకం లేదన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను వైసీపీలో చేరినట్టుగా సుబ్బారాయుడు తెలిపారు.  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మాత్తుగా మరణించారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పార్టీని ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటిస్తున్నారన్నారు.ఈ సమయంలో ప్రజల నుండి స్పందన వచ్చిందన్నారు. ఈ సమయంలో జగన్ ను జైల్లో పెట్టారనే సానుభూతి తనకు ఉందన్నారు. ఈ కారణంగానే తాను వైసీపీలో చేరినట్టుగా సుబ్బారాయుడు వివరించారు. 

2014లో తాను టీడీపీలో చేరాల్సి ఉందన్నారు. కానీ తనకు జగన్ పై ఉన్న సానుభూతి కారణంగానే ఆ పార్టీలో చేరానన్నారు. చంద్రబాబునాయుడు నుండి కూడా తనను పార్టీలో చేరాలని ఆహ్వానించినట్టుగా సుబ్బారాయుడు వివరించారు.  ఆ సమయంలో వైసీపీలోని ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల తాను ఆ ఎన్నికల్లో ఓడిపోయినట్టుగా సుబ్బారాయుడు ఆరోపించారు. 

also read:వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్

ఈ విషయమై తన వద్ద రుజువులున్నాయన్నారు. అదే సమయంలో తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు.. దీంతో నియోజకవర్గం మొత్తం పూర్తిగా తిరగలేకపోయాయని సుబ్బారాయుడు వివరించారు. 2019లో ప్రసాదరాజు వైసీపీ టికెట్ ను జగన్ కేటాయించారన్నారు. ప్రసాదరాజును గెలిపించి తీసుకురావాలని జగన్ ఆదేశించారన్నారు. ఈ స్థానంలో ప్రసాదరాజును గెలిపించామని ఆయన చెప్పారు. 

సస్పెన్షన్ పై  పార్టీ నియామళిని పాటించలేదు: కొత్తపల్లి

 నా సస్పెన్షన్ పై పార్టీ నియావళిని పాటించలేదన్నారు.తనపై పార్టీకి ఎవరు, ఏమని ఫిర్యాదు చేశారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. కనీసం తనతో మాట్లాడకుండానే సస్పెన్షన్  ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎవరి ఒత్తిడితో తనను సస్పెండ్ చేశారో చెప్పాలని చెప్పారు.వైసీపీ క్రమశిక్షణ సంఘం తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రతి రోజూ పార్టీని విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. సీఎం జగన్ కన్నా తానే రాజకీయాల్లోకి ముందు వచ్చినట్టుగా కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు.తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా అవినీతి ప్రస్తావన లేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios