అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భద్రత పునరుద్ధరణపై విచారణ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో జరపాలని ప్రభుత్వం కోరింది. ప్రతిపక్ష నేతకు సంబంధించి భద్రతను బహిర్గత పరచడం సరికాదని ఏజీ హైకోర్టుకు విన్నవించారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ ను అడ్వకేట్ జనరల్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాదనలు బహిరంగంగా కాకుండా ఇన్ కెమెరా ప్రొసీడిగ్స్ లో జరపాలని కోరారు. 

ప్రతిపక్ష నేతకు సంబంధించిన భద్రతా వివరాలు బహిరంగం చేయలేమని కోర్టుకు స్పష్టం చేశారు. చంద్రబాబు భద్రతపై ఉన్నతాధికారి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు వివరణ ఇస్తారని స్పష్టం చేశారు. ఏజీ విన్నపాన్ని మన్నించిన హై కోర్టు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు అనుమతి ఇచ్చింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.