Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు శివారులో లారీడ్రైవర్ అమానుషం... చెత్తకాగితాలు ఏరుకునే మహిళ దుర్మరణం

కేవలం రూ.300వందల కోసం ఓ నిరుపేద మహిళలో లారీ డ్రైవర్ అమానుషంగా వ్యవహరించాడు. కన్న బిడ్డల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహిళ చివరకు లారీకిందపడి దుర్మరణం చెందింది. 

poor woman died fell under the truck  at guntur
Author
Guntur, First Published May 20, 2022, 11:48 AM IST

గుంటూరు: రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆమెది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కుటంబపోషణ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి చెత్త కాగితాలు ఏరుకుంటుంది. ఇందుకోసం తాజాగా చిలకలూరిపేట నుండి గుంటూరు వెళ్ళడానికి ఇద్దరు పిల్లలతో లారీఎక్కిన ఆమెతో డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో లారీకింద పడి మహిళ మృతిచెందింది. 

వివరాల్లోకి వెళితే... చిలకలూరిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వివాహిత చెత్తకాగితాలు ఏరుకుని జీవిస్తుంది. కేవలం చిలకలూరిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు చెత్తకాగితాలు ఏరుకోడానికి దూరప్రాంతాలకు కూడా వెళుతుంటుంది. ఈ క్రమంలోనే గుంటూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి బయలుదేరింది. 

ఓ లారీలో ఎక్కి తల్లీ బిడ్డలు గుంటూరు చేరుకున్నారు. గుంటూరు శివారులోని నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపానికి లారీ చేరుకోగానే దిగడానికి మహిళ సిద్దమయ్యింది. ముందుగా ఆమె దిగి డ్రైవర్ కు 100రూపాయలు ఇచ్చి పిల్లలను కిందకు దించడానికి ప్రయత్నించింది. కానీ లారీ డ్రైవర్ ఒక్కొక్కరికీ వంద రూపాయల చొప్పున మొత్తం 300రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. అంత డబ్బు తనవద్ద లేవు కాబట్టి ఇచ్చుకోలేనని ఆమె తెలిపింది. 

తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో లారీ డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. మహిళ అప్పటికే లారీదిగి వుండటంతో ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. లారీని స్టార్ట్ చేసి ముందుకు తీసుకువెళుతుండటంగా ఆందోళనకు గురయ్యింది. పిల్లల కోసం ప్రాణాలకు తెగించిమరీ కదులుతున్న లారీని పట్టుకుని వేలాడుతూ కొంతదూరం వెళ్లింది. ఇది గమనించిన డ్రైవర్ లారీని మరింత వేగంగా పోనిచ్చాడు. అయినా మహిళ భయపడకుండా అలాగే వేలాడుతూ వెళ్లింది. 

అయితే లారీ వేగానికి ఆమె పట్టుతప్పి రోడ్డుపై పడిపోయింది. దీంతో లారీ ఆమెపైనుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఇది గమనించిన లారీ డ్రైవర్ ఇద్దరు పిల్లలను అక్కడే వదిలి పరారయ్యాడు. 

ఈ ప్రమాదాన్ని గమనించిన పోలీసులు స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడని... అతడికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పొట్టకూటికోసం చెత్తకాగితాలు ఏరుకుని జీవించే మహిళను డబ్బు కోసం ప్రాణాలుతీసిన లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. తల్లిని కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరుతున్నారు. 

ఇక ఏలూరులోనూ ఇలాగే డబ్బుల కోసం జరిగిన గొడవ ఒకరిని హాస్పిటల్ పాలుచేసింది. తీసుకున్న అప్పు డబ్బులు చెల్లించలేదని ఓ వ్యక్తిపై కొందరు ఇష్టారీతితో దాడికి దిగారు. ఈ  దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఏలూరలోని మార్కెట్ వద్ద గోపి అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన వ్యాపారం కోసం అవసరం ఉండి రూ. 30 వేలను తెలిసిన వ్యక్తి వంశీ దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులకు ప్రతి నెల రూ. 3 వేలను చెల్లిస్తున్నాడు. అయితే గత ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో గత నాలుగు నెలల నుండి గోపి ఈ డబ్బులు వంశీకి చెల్లించలేదు.  దీంతో ఈ నెల 15న తన వద్దకు వచ్చిన వంశీ ఇష్టారీతిలో దూషించాడని గోపి చెప్పాడు. ఈ విషయమై తమ మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకున్నట్లు తెలిపాడు. మద్యంమత్తులో వున్న వంశీ మరికొందరితో కలిసి క్రికెట్ లో ఉపయోగించే వికెట్లతో దాడికి దిగారని గోపి చెప్పారు. దీంతో గోపి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. 


 

  

Follow Us:
Download App:
  • android
  • ios