పరారీలో విజయవాడ కిలాడీ లేడీ: పోలీసు ప్రత్యేక బృందం వేట
ఉద్యోగాల పేరుతో, రియల్ ఎస్టేట్ దందా పేరుతో పలువురిని మోసం చేసిన విజయవాడ కిలాడీ లేడీ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలింపు జరుపుతోంది. రమాదేవి అనే ఆ మహిళపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
విజయవాడ: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన విజయవాడ కిలాడీ లేడీ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఉద్యోగాల పేరు మీదనే కాకుండా రియల్ ఎస్టేట్ పేరు మీద కూడా ఆమె 70 లక్షల రూపాయల మేరకు ప్రజలనుంచి వసూలు చేసినట్లు ఆరోపణ వచ్చాయి. ఆమెను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మోసాల్లో రమాదేవికి కూతురు, కుమారుడు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. పెనమలూరు, మైలవరంల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని మధురానగర్ కు చెందిన రమాదేవిపై, ఆమె కుమారుడు, కూతుళ్లపై విజయవాడ కమిషనరేట్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో కేసులు నమోదయ్యాయి .
మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట రూ.28 లక్షలు వసూలు చేసింది. దీనిపై బాధిత మహిళ మైలవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేిసంది. దాంతో పోలీసులు 209లో 42 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.
2017 మేలో బాధితురాలిని కొట్టి, బెదిరించినకేసులో మైలవరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ప్రస్తుతం ఆ కేసు విచారణ కూడా కోర్టులో నడుస్తోంది.పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.24 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చిన వ్యవహారంలో రమాదేవిపై 2020 డిసెంబర్ లో పెనమలూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
ఆ కేసులో తొలి ముద్దాయిగా ఉన్న రమాదేవిని జనవరి 11వ తేదీన హైదరాబాదులో మెహదీపట్నం ఫ్లై ఓవర్ సమీపంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును విజయవాడ ఆరో అనదపు ఎంఎం కోర్టు న్యాయమూర్తి రిటర్న్ చేశారు దాంతో ఆమె స్టేషన్ బెయిల్ మీద విడుదలైంది.
తనతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఓ మహిళను కూడా రమాదేవి మోసం చేసింది. బాధితురాలి కుమారుడికి, కూతురికి హైకోర్టులోనూ నీటిపారుదల శాఖలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నకిల అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి రూ.19.90 లక్షలు కాజేసింది. మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ ఈ ఏడిదా ఫిబ్రవరిలో పెనమలూరు పోలీలుస స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై మరో కేసు నమోదైంది.
పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ రమాదేవిలో మార్పు రాలేదు. దీంతో ఈ ఏడాది మార్చి 23వ తేదీన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. వైట్ కాలర్ నేరాల్లో ఆరోపితేరిన ఓ మహిళపై ఇలాంటి షీట్ ఓపెన్ చేయడం విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే తొలిసారి కావడం విశేషం. ఆమె తన భర్తపై గతంలో పెనమలూరు పోలీసు స్టేషన్ లో 498 కింద కేసు పెట్టింది.