Asianet News TeluguAsianet News Telugu

కంచే చేను మేసింది.. దొంగతనం చేస్తూ దొరికిపోయిన‌ పోలీసులు, వీడియో వైరల్

రాత్రి పూట దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు పోలీసులు వాహ‌నాల్లో గ‌స్తీ తిరుగుతుంటారు. అయితే కంచే చేను మేసిన చందంగా ప్రజల ధన, మాన , ప్రాణాలను  కాపాడాల్సిన పోలీసులే చోరీలకు పాల్పడితే. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి.

police robbery video goes viral in chittoor district
Author
Chittoor, First Published Sep 10, 2021, 3:11 PM IST

రాత్రి పూట దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు పోలీసులు వాహ‌నాల్లో గ‌స్తీ తిరుగుతుంటారు. అయితే కంచే చేను మేసిన చందంగా ప్రజల ధన, మాన , ప్రాణాలను  కాపాడాల్సిన పోలీసులే చోరీలకు పాల్పడితే. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి. ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి స‌మ‌యంలో  రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వ‌ద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లి దుస్తులు తీసుకుని వెళ్లిపోయారు.

చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఈ విష‌యం బయట పడింది. పోలీసుల‌పై దుకాణ‌ యజమాని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అత‌డికి సాయం చేసిన‌ మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. అయితే, పోలీస్ శాఖ పరువు పోతుందని ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. చివ‌ర‌కు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్క‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది
 

Follow Us:
Download App:
  • android
  • ios